అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించండి.
*కమిషనర్ ఎన్. మౌర్య.
తిరుపతి : అర్జీదారులు సంతృప్తి పడేలా వారి సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమం నిర్వహించగా 60 మంది నేరుగా వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో అందజేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో 60 మంది నుండి వినతులు అందాయని అన్నారు. ఇందులో మఖ్యంగా ఇండ్లు కోసం డబ్బులు కట్టామని, మాకు డబ్బులయినా, ఇల్లు అయినా ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి తెలిపామని త్వరలో నిర్ణయం వస్తుందని అన్నారు. అలాగే తమకు టిడిఆర్ బాండ్లు ఇవ్వాలని, భూగర్భ డ్రైనేజి మరమ్మతులు చేయించాలని కోరారని తెలిపారు. ఆక్రమణలు తొలగించాలని, అక్కడక్కడా ఉన్న చెత్త కుప్పలు తొలగించాలని కోరారని అన్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులు వెళ్లి పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, సెక్రటరీ రాధిక, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, రాజు, శ్రావణి, ఆర్.ఓ.లు సేతు మాధవ్, కే.ఎల్.వర్మ, డి.సి.పి.శ్రీనివాస రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు..
అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించండి.
Related Posts
జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం.
TEJA NEWS జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం.కమిషనర్ ఎన్.మౌర్య జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. కరకంబాడి మార్గంలోని బయోట్రిమ్, ఫారెస్ట్ నుండి వన్యప్రాణులు ఉపాద్యాయ నగర్ లోనికి వస్తున్నాయని ప్రజా ఫిర్యాదుల…
మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.
TEJA NEWS మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.కమిషనర్ ఎన్.మౌర్య నగరంలో ఉత్పన్నమయ్యే మురుగునీరు డ్రెయినేజీ కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఉదయం 14 వ డివిజన్ లోని ఎమ్మార్…