TEJA NEWS

గంగపురి సమీపంలో ఇసుక లారీ బోల్తా

పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గంగపురి గ్రామ సమీపంలోని రైస్ మిల్లు దగ్గర కొద్దిసేపటి క్రితం ఇసుక లారీ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది.

అడవి సోమన పల్లి నుండి కరీంనగర్ కు ఇసుక లోడుతో వెళ్తున్న లారీ గంగపురి గ్రామ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తాడి చెట్టును ఢీ కొట్టి బోల్తా పడింది,డ్రైవర్​ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న స్థానికులు,తోటి లారీ డ్రైవర్లు… క్యాబిన్​లో చిక్కుకున్న లారీ డ్రైవర్ ను బయటకు తీశారు. అదృష్టవసత్తు లారీ డ్రైవర్ కు ఎటువంటి ప్రమాదం జరగపోవడంతో అందరూ ఊపిరి ఊపిరి పీల్చుకు న్నారు..


TEJA NEWS