TEJA NEWS

శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేరు సంఘం అధ్యక్షుడు శీలంకోటి రవికుమార్

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి చిన్న శంకర్‌పల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం మండల మేరు సంఘం అధ్యక్షుడు శీలం కోటి రవికుమార్, అరుణ దంపతులు స్వామివారికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆంజనేయ స్వామి అభిషేకం, నవగ్రహాల పూజ, శివలింగానికి రుద్రభిషేకం, అమ్మవారికి ఒడి బియ్యం, కులమేరు దైవము శ్రీ శంకర దాసమయ్య అభిషేకం, భజన మండలి చే భజన కార్యక్రమాలు జరిగాయి. ఆలయ పురోహితులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. అనంతరం భక్తులకు రవికుమార్ అన్నదానం ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల నాయకులు మహిళలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS