TEJA NEWS

పై ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక

ఉమ్మడి ఖమ్మం

విద్యతో పాటు ఉన్నత విలువలు కలిగి ఉండాలని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. స్థానిక యస్.బి.ఐ.టి. కళాశాలలో నిర్వహించిన పై ఇన్ఫోటెక్ ప్రాంగణ నియామకాలలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో కూడా ప్రాంగణ నియామకాలు చేపట్టడం, వాటిలో తమ విద్యార్థులు ప్రతిభను చాటటం పట్ల వారు హర్షం వ్యక్తం చేసారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు వారు పనిచేసే ప్రాంతంలో విలువలతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉండాలని వారికి దిశనిర్ధేశ్యం చేసారు.

ఐటి సర్వీసెస్ మరియు ఐటి ప్రోవైడర్ కంపెనీ అయిన పై ఇన్ఫోటెక్ సంస్థలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలప్పర్ ఉద్యోగానికి కళాశాలలో జరిగిన ప్రాంగణ నియామకాలలో 185 మంది యస్.బి.ఐ.టి. విద్యార్థులు పాల్గొనగా 72 మంది మౌకిక పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో చివరి దశలో 13 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. పై ఇన్ఫోటెక్ సంస్థకు అర్హత సాధించిన విద్యార్థులకు 3 నెలలు శిక్షణను ఇప్పిస్తారని ఈ సమయంలో వారికి నెలకు 25,000/- రూపాయలు స్టైఫండ్ అందుతుందని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. శిక్షణ అనంతరం వార్షిక ఆధాయంగా 8 లక్షల నుండి 9 లక్షల వరకు అందుతుందని వారు తెలియచేసారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పై ఇన్ఫోటెక్ హెచ్. ఆర్. డైరెక్టర్ విజయ్ జైస్వాల్, హెచ్.ఆర్. మేనేజర్ పియూష్ తివారి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS