TEJA NEWS

టీఎస్ యూటిఎఫ్ మండల కార్యవర్గం ఎంపిక

సూర్యపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( టీఎస్ యూటిఎఫ్ ) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల నూతన కార్యవర్గాన్ని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎన్.సోంబాబు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి జి.వెంకటయ్య సమక్షంలో ఏకగ్రీవ ఎంపిక నిర్వహించారు. మండల శాఖ నూతన అధ్యక్షుడిగా మద్దిరాల మండలం గోరెంట్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పల్లేటి అభినవ్ ఎన్నికవగా, ప్రధాన కార్యదర్శిగా గోరెంట్ల జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు దేవులపల్లి రమేష్, ఉపాధ్యక్షులుగా వరికుప్పల గంగరాజు, మందడి శోభారాణి, కోశాధికారిగా దార బిక్షం లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎన్నుకున్నారు. ఇదే విషయమై మండల శాఖ అధ్యక్షునిగా ఎన్నికైన పల్లేటి అభినవ్ మాట్లాడుతూ తమపై నమ్మకం తో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.


TEJA NEWS