యాదాద్రి యాదవ భవన్ భూమి పూజలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
యాదాద్రి భువనగిరి జిల్లా లోని యాదాద్రి “శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ” స్వామి వారి ఆలయ సమీపంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ , మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ మరియు ట్రస్టు మెంబర్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే యాదవ్ భవన్ భూమి పూజ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం భూమి పూజలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యాదవ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని బీసీ.ల ఐక్యతను చాటిచెప్పే సంకేతానికి నిదర్శనంగా భవనం సూచిస్తుందని, యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధిలో యాదవ భవనాన్ని నిర్మించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, లక్ష్మి నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఎల్లపుడు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ లక్ష్మణ్ యాదవ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , రాజు యాదవ్ , నరేందర్ యాదవ్ , ఐలేష్ యాదవ్ , యాదాద్రి యాదవ్ భవన్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దుల బాబు రావు యాదవ్ , ప్రకాష్ యాదవ్ , కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ , యాదయ్య యాదవ్ , జై కిషన్ యాదవ్ , రవీందర్ నాథ్ యాదవ్ , మల్లేష్ యాదవ్ , దారబోయిన శ్రీనివాస్ యాదవ్, మనీష్ యాదవ్ , నర్సింగ్ యాదవ్ , యూత్ ప్రెసిడెంట్ గొర్ల ఏశ్వంత్ యాదవ్ , మహేందర్ యాదవ్ , సంతోష్ యాదవ్ , రాజేష్ యాదవ్ , ట్రస్టు మెంబర్లు మరియు యాదవ సోదర-సోదరమణిలు తదితరులు పాల్గొన్నారు.