TEJA NEWS

బాధితులకు నష్ట పరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలి

-మాజీ ఎంపీ నామ డిమాండ్

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వరదల తాకిడికి పలు ప్రాంతాలు నీట మునిగాయని, తద్వారా జనజీవనం స్తంభించిపోయిందని ఆయన పేర్కొన్నారు. పలు ఇళ్లలో నిత్యవసర వస్తువులు, ఇంటి సామాగ్రి, ఎలక్ట్రిక్ పరికరాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయి తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.
నష్టపోయిన బాధితులకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని అలానే పునరావాస ఏర్పాట్లను చేయాలని ఆయన కోరారు. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టి, బాధితులకు ఆహారం, నీరు, మందులు వంటి అవసరాలను తక్షణం అందించి వారికి బాసటగా నిలవాలని సూచించారు. అనంతరం, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరదలతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి నష్టపరిహారం కోసం అంచనా వేయించాలని, వారందరికీ తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించటం తో పాటు వారికి తగిన పరిహారం అందించాలన్నారు.
ఈ విపత్తు సమయంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చి, నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Print Friendly, PDF & Email

TEJA NEWS