TEJA NEWS

నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు..

నార్కోటిక్ జగిలాం తో జిల్లా కేంద్రంలో తనిఖీలు

—మహబూబాబాద్ టౌన్ సీఐ:: పెండ్యాల దేవేందర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలిని పలు పార్సెల్ ఆఫీసులు,కిరాణా షాపులలో, రైల్వేస్టేషన్స్, బస్సు స్టాండ్, అనుమానిత ఇండ్లలో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పట్టణ పోలీస్ తనిఖీలు నిర్వహించారు.నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జగిలాం తో డాగ్ స్క్వాడ్ బృందం తో మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్ సిబ్బందితో కలిసి పలు పార్సెల్ ఆఫీసులు,కిరణ షాప్, రైల్వేస్టేషన్, బస్సు స్టాండ్,మొదలగు ప్రాంతల్లో మరియు కొన్ని అనుమానిత ఇండ్లలో తనిఖీలు చేపట్టడం జరిగింది.

పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా వ్యక్తుల వద్ద , పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS