TEJA NEWS

విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

హైదరాబాద్
విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం వల్లే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పు డు బస్సులను అందు బాటులో ఉంచుతున్నారని తెలిపారు.

అయినా కొన్ని రూట్లలో విద్యార్థుల రద్దీ వీపరీతంగా ఉంటున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిందని తెలిపా రు.కాగా, టీజీఎస్ఆర్టీసీకి చెందిన ఒక బ‌స్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేస్తోన్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యియి..

ఈ విషయం ఆర్టీసీ యాజమాన్యందృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు.రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణ‌యించిందని.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు కూడా తీసుకోవ‌డం జ‌రుగుతోంద ని తెలిపారు.

విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేం దుకు టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని వెల్లడించారు. తమ వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫుట్ బోర్డు ప్రయాణం సురక్షితం కాదన్నారు.


TEJA NEWS