స్వామి వివేకానంద, భగత్ సింగ్ లను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి : అదనపు కలెక్టర్
సూర్యాపేట జిల్లా : యువత నచ్చిన రంగంలో కష్టపడి జీవితంలో ఎదగాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అన్నారు. సూర్యాపేట లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఆడిటోరియం నందు జిల్లా యువజన మరియు క్రీడా నిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు -2025 లో ముఖ్య అతిధిగా జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత పాల్గొని స్వామి వివేకానంద ఫొటో కి పూలమాల వేసి,జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువతకి ఆదర్శంగా ఉండే స్వామి వివేకానందని, భగత్ సింగ్ లను స్మరించుకుంటూ వారి ఆలోచనలను యువత అనుసరించాలని అన్నారు. దేశం లో నిరక్షరాస్యత,మూడ నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని యువత వాటిపై ప్రజలోకి వెళ్ళి సందేహాలు తొలిగించాలని, 35 సంవత్సరాలు వచ్చే సరికి కుటుంబ భాద్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 15-20 సంవత్సరాల వయస్సు నుండే యువత సక్రమంగా అలోచించి జీవితంలో ఎదగాలని,సోషల్ మీడియా లాంటి వాటిని దూరంగా ఉండాలని ఈ సందర్బంగా అన్నారు. ఇష్టంగా చేస్తే ఎంత కఠినమైన పని కూడా కష్టం అనిపించదు అని, గొప్ప వారి చరిత్రలు తెలుసుకొని వారు ఎలా ఎదిగారో యువత కూడా వారి మార్గంలో నడుచుకుంటూ ఉన్నత శిఖరాలను ఆదిరోహించాలని అదనపు కలెక్టర్ అన్నారు. యువత ఆది గురువు శంకరచార్య చెప్పిన
మానవ సేవయే -మాధవ సేవ సూక్తిని అనుసరించాలని, అలాగే యువత చదువుతో పాటు సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, కవిత్వం మొదలగు అన్ని రంగాలలో రాణిస్తేనే పరిపూర్ణం గా ఉంటుందని అదనపు కలెక్టర్ అన్నారు.
తదుపరి వివిధ పాఠశాలల నుండి, కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులచే ప్రదర్శించిన సైన్స్ మేళా ని వీక్షించారు. జిల్లా యువజనోత్సవాలు లో భాగంగా నిర్వహించిన జానపద నృత్యం, జానపద గేయం పోటీలలో అత్యున్నత ప్రతిభ చూపెట్టిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా యువజన మరియు క్రీడా అధికారి జి రాంచందర్ రావు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ వెంకటెష్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు