ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి అధిక నిధులు తీసుకొస్తా
ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి
*హాస్పిటల్ పరిశీలన, మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులతో భేటీ
ఉమ్మడి ఖమ్మం
ఉభయ జిల్లాల ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యం అందించేలా ఖమ్మంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హాస్పిటల్ ను సందర్శించి.. వార్డులను పరిశీలించారు. పై కప్పు కురుస్తుందని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూశారు. అనoతరం మెడికల్ సూపరిoటెoడెంట్ కిరణ్ కుమార్ చాంబర్లో వైద్యులతో సమావేశమయ్యారు. 570 బెడ్లు ఉండి, రోజుకు 2000మంది ఓపీ పేషంట్లు వస్తున్నారని ఈ సందర్భంగా వారు ఎంపీకి తెలిపారు.
వైద్య విధాన పరిషత్ వైద్య కళాశాల ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేరని వివరించారు. స్పందించిన ఎంపీ రఘు రాం రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి, హెల్త్ మినిష్టర్ దృష్టికి తీసుకెళ్లి అధిక నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తామన్నారు. హాస్పిటల్ అవసరాల కోసం నాలుగు ఫ్రీజర్లను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. అలాగే టీఎస్ఎంఎస్ఐడిసీ సంస్థ ఇంజనీర్తో ఎంపీ ఫోన్లో మాట్లాడి..త్వరితగతిన మరమ్మతులు చేపట్టి, రోగులకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలని అదేషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, చావా శివరామకృష్ణ, నాయకులు మిక్కిలినేని నరేందర్, ఇమామ్ భాయ్ , దుంపల రవి, రామకృష్ణా రెడ్డి, శ్రీఖళా, తదితరులు పాల్గొన్నారు.