TEJA NEWS

గురుకులాల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి

, పెద్దపల్లి జిల్లా

గురుకులాల కార్యదర్శి డా. వి ఎస్ అలుగు వర్షిణి గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం బోధన బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్ దార మధు మాట్లాడుతూ.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గత కొన్ని సంవత్సరాల నుండి నీతి నిజాయితీగా పనిచేస్తూ పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ రెగ్యులర్ టీచర్స్ తో సమానంగా పనిచేస్తూన్న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6000 మందిని మూడు నెలల నుండి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా వారిని విధుల నుండి తొలగించడం ఎస్సీ ఎస్టీ , బీసీ బహుజనుల పిల్లల విద్యాభివృద్ధిని కాల వ్రాసే మీ కుట్రల ప్రణాళిక పుస్తకంలోని ఒక పాఠ్యాంశంగా పెట్టుకొని మొన్నటి వరకు ట్రాన్స్ ఫర్ లని ప్రమోషన్స్ అని విద్యా సంవత్సరం మొదలైన నాటి నుండి క్లాసులు జరగకుండా చేసి ఇప్పుడు తాత్కాలిక ప్రాతి పదికన పనిచేసే వారిని తొలగించడం దారుణం విద్యాసంవత్సరం మొదలైన నాటి నుండి అట్టడుగు వర్గాల అభివృద్ధి విద్యతోనే సాధ్యం కనుక విద్యా రంగాన్ని అన్ని విధాలుగా ఆగం చేస్తూ మీ కుట్రల కబంద హస్తాలతో మా పిల్లల జీవితాలను చిదిమేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ వున్నారు.

ఇప్పటికే మా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ఆరకొర సౌకర్యాలతో ఆకలి కేకలతో అలమటిస్తూ నాన్యత పరిశుభ్రత లేని ఆహారం తిని ఫుడ్ పాయిజన్ పాము కాట్లతో విష జ్వరాలతో సమీదల్లా రాలిపోతున్నా స్పందించని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిసి విధుల నుండి తొలగించిన వారందరిని కాంట్రాక్టు పద్దతిలో విధుల్లోకి తీసుకొని వారందరికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ గురుకులాల్లో 2017 వ సంవత్సరంలో మెను ప్రకారం ఇప్పుడు పెరిగిన ధరల కనుగుణంగా కాస్మోటిక్స్,మెస్ ఛార్జీలు పెంచి పిల్లలకు నాణ్యమైన విద్య వైద్యం పౌస్టికాహారం పరిశుభ్రమైన మౌలిక వసతులు కల్పిస్తూ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు న్యాయం చేయాలని, వెంటనే సెకండ్ హిందీ పోస్ట్ లు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బ్రహ్మ కుమారిస్ సంస్థను వెంటనే తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థల వల్ల గురుకులాలో నష్టం ఎదురవుతుందని ఆయన ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టి జి పి ఏ జిల్లా ప్రధానకార్యదర్శి కె ఎల్ మూర్తి,జిల్లా ఉపాధ్యక్షులు ఉత్తర్ల మహేష్,జిల్లా కోశాధికారి దుర్గం కుమార్,జిల్లా మీడియా ఇంచార్జీ మరియు పెద్దపల్లి ఎట్ సుల్తానాబాద్ బాలుర గురుకుల పాఠశాల కళాశాల వైస్ చైర్మన్ దేవి రాజేందర్,టి జి పి ఏ జిల్లా కార్యవర్గ సభ్యులు కాల్వ కుమార్,పేరెంట్స్ కమిటి మీడియా ఇంచార్జీ లంక దాసరి భాస్కర్,కార్యవర్గ సభ్యులు గుండెటి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS