TEJA NEWS

ప్రకృతి విపత్తు నష్టమెంతో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి……………. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి :
రాష్ట్రవ్యాప్తంగా
గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్ష బీభత్సం ప్రకృతి విపత్తుతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలు వరద నీటిలో మునిగి కొట్టుకుపోయి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరిగితే ఇంతవరకు నష్టపోయిన ప్రాంతాలను కానీ నష్టపోయిన వారిని కానీ ప్రభుత్వ పెద్దలు అధికారులు సందర్శించడం పలకరించకపోవడం దారుణమని కనీసం విపత్తు నష్టం ఎంతో అంచనాలను కేంద్ర ప్రభుత్వం కోరితే ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకపోవడం దారణమని ఇది ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి బాధ్యతారహిత్యానికి అద్దం పడుతుందని విపత్తు సమయంలో ఈ రాజకీయ కక్షలు ఏమిటోనని వెంటనేప్రకృతి విపత్తు నష్టం ఎంతో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకపక్క ప్రకృతి విపత్తుకు లక్షల ఎకరాల పంట నష్టంతో రైతులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నివాసాలు కూలిపోయి పేదలు నిరాశ్రయులై ఆశ్రయం కోసం ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం మరోపక్క వివాహ శుభకార్యాలలో పాల్గొనడం దారణమని ఎన్నికల సమయంలో ఉపయోగించిన హెలికాప్టర్లను ప్రకృతి విపత్తు సమయంలో బాధితులను పరామర్శించడానికి విపత్తు నష్టం ఎంతో అంచనా వేయడానికి హెలికాప్టర్లను ఎందుకు ఉపయోగించ లేదో ప్రభుత్వం పెద్దలు చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా సమయంలో ప్రాణ ఆస్తి నష్టం జరిగితే 25 లక్షలు ప్రాణనష్ఠానికి చెల్లించాలని డిమాండ్ చేయలేదా అని ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఐదు లక్షలు ప్రాణనష్ఠానికి ఆవు గేదెల నష్టానికి 50,000 గొర్లు మేకలకు 5000 నష్టపరిహారాన్ని చెల్లిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు


అందుబాటులో ఉన్న ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకొని ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాల్సింది పోయి లక్షల క్యూసెక్కుల నదుల నీటిని సముద్రపు పాలు చేస్తా ఉన్నారని అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్న ఒక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టలేదని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మన్నును కూడా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల పేరుతో బోగస్ హామీల ఇస్తే నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చి ఇప్పుడు చింతిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ బి లక్ష్మయ్య మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ టిఆర్ఎస్ అధికార ప్రతినిధి మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డి మహేష్ మాణిక్యం నందిమల అశోక్ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS