Spread the love

రంజాన్ మాసం శాంతి, ఐక్యత, సామాజిక సౌభ్రాతృత్వం ప్రేరేపించే కాలం,జ‌న‌సేన యువ‌నాయ‌కులు మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ‌

చిల‌క‌లూరిపేట‌:పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జ‌న‌సేన యువ నాయ‌కులు మండ‌లనేని చ‌ర‌ణ్‌తేజ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం అనేది శాంతి, ఐక్యత, సామాజిక సౌభ్రాతృత్వం ప్రేరేపించే కాలం అని చ‌ర‌ణ్‌తేజ‌ తెలిపారు. మతసామరస్యం, ప్రేమ, పరస్పర సహకారం వంటి విలువలను ఈ మాసం గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు. ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసాన్ని సంప్రదాయబద్ధంగా పాటించాలని, సమాజంలో శాంతి నెలకొనేలా ప్రార్థనలు చేయాలని కోరారు.