TEJA NEWS

జిల్లాలో ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు
వాగులు, చెరువులు చూసేందుకు ప్రజలేవరు వెళ్లవద్దు
పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఉమ్మడి ఖమ్మం

జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, వాటిని చూసేందుకుప్రజలేవరు బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణాలతో పాటు గ్రామ పంచాయతీల పరిధిలో చిన్న, పెద్ద చెరువులు,వాగులు ప్రమాదకర స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయని చెరువులు, వాగులు, వంకలు చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తున్నారని, సెల్ఫీ ఫోటోల మోజులో నీటి ప్రవాహంలో పడే ప్రమాదాలు వున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఆవకాశం వున్న నేపథ్యంలో చెరువులు, వాగులు, మున్నేరు ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని అన్నారు. వర్షాలకు వాగులు ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలలో చెరువులు నిండి ప్రమాదకర స్దాయిలో వున్నాయనే విషయాన్ని గ్రామీణ,పట్టణ ప్రజలు గ్రహించి అటువైపు వెళ్లకుండా వుండాలని సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS