TEJA NEWS

కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి సిఐటియు డిమాండ్..

డాక్టర్ మౌమిత పై హత్యచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విడుట సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది .ఈ సందర్భంగ సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కలకత్తా మహా నగరంలో డాక్టర్ మౌమిత ను అమానవీయంగా హత్య చేసినటువంటి దోషులను శిక్షించాలని డాక్టర్ మౌమితకు న్యాయం జరిగేలా చూడాలని భారతావని సిగ్గుపడేలా మహిళలపై చేస్తున్నటువంటి ఆకృత్యాలను విద్యార్థులు, మహిళలు పై చేస్తున్నటువంటి అఘాయిత్యాలను కట్టడి చేసేలా చర్యలు చట్టాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెన్నెల లక్ష్మి, మనీ, సన్యాసమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS