TEJA NEWS

సిల్వర్ డెల్ స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి తగిన న్యాయం చేయాలి.

  

చేవెళ్ల : ప్రైవేట్ స్కూల్స్ ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అని పిడిఎస్ యు చేవెళ్ల డివిజన్ సహాయ కార్యదర్శి పంబలి ప్రభాస్ అన్నారు. గత కొన్ని రోజుల ముందు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్సు ఇప్పుడు ఈ ఘటన ఇక్కారెడ్డి గూడ గ్రామంలో జరిగిన సిల్వర్ డెల్ స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు తగిన న్యాయం చేసి జరిగిన ప్రమాదం పై అధికారులు విచారణ జరిపి, ప్రైవేట్ స్కూల్స్ వాహనాల అతనికి నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ) గా డిమాండ్ చేస్తున్నాం. గాయపడిన విద్యార్థులందరికీ పాఠశాల యాజమాన్యం వైద్య ఖర్చులు ఇవ్వాలని అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS