కూకట్పల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు మరియు పలు అభివృద్ధి పనుల పై సమీక్షా నిర్వహించిన PAC చైర్మన్ , ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగింది , పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని,అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,
వర్షాకాలంలో దెబ్బ తిన్న రోడ్ల ను వెంటనే పునరుద్ధరించేలా అధికారులకు అదేశాలు ఇవ్వాలని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది.
అదేవిధంగా చెరువుల సుందరికరణ, పార్క్ లు, స్మశాన వాటికలను అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఉషముళ్ళపూడి కమాన్ నుండి ఎల్లమ్మ బండ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన గల విద్యుత్ స్థంబాలను స్థాన భ్రంశం చర్యలను వెంటనే చేపట్టాలని, అదేవిధంగా రోడ్డు డివైడర్ మధ్యలో సుందరికరణ పనులు చేపట్టాలని, మరియు ప్రగతి నగర్ నుండి JNTU వరకు ఫ్లై ఓవర్ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని,ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది అని, విధి దీపాల సమస్యను పరిష్కరించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
దీని పై జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ సానుకూలంగా స్పందించడం జరిగినది.