TEJA NEWS

124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి జి.ఎచ్.ఎం.సి అధికారులతో జరిమానా విధించి, ఇంకోసారి చెత్తను రోడ్లపై వేయకూడదని హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చెత్తను వీధుల్లోనూ, కాలువలోను, చెరువుల్లోనూ, రోడ్లమీద వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. కొంతమంది ఆటోలలో వచ్చి ఇక్కడ చెత్తను వేస్తున్నట్లు గుర్తించామని అట్టి వారికి కూడా జరిమానా వేసి మందలిస్తామని అన్నారు. పారిశుధ్య కార్మికులకు సహకరించి, మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా చూసుకోవాలని తెలియచేసారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, మోజెస్, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.