TEJA NEWS

నెంబర్ ప్లేట్ లేని 13వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు 4, మైనర్ వాహనాలు 6 సీజ్:ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

గద్వాల:-నేరాలను నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు నిర్వహించిన గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ నెంబర్ ప్లేట్ లేని 13వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు 4, మైనర్ వాహనాలు 6 సీజ్ చేసినట్లు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ రీతు రాజ్ ఆదేశాల మేరకు గద్వాల పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో గురువారం రాత్రి వాహనా తనిఖీలు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ ను నిర్వహించినట్టు ట్రాఫిక్ ఎస్సై తెలిపారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ… సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించామన్నారు. తప్పుడు నంబర్ తో వాహనాలు నడుపుతూ దొంగతనాలకు, చైన్స్ స్నాచింగ్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు.గద్వాల పట్టణ ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి సరైన నెంబర్ ప్లేట్లను తమ వాహనాలకు పెట్టుకోగలరని సూచించారు. మైనర్లు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. .


TEJA NEWS