సెంట్రల్ వెనిజులాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని కూలిన ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశామని, కనీసం 11 మంది గాయపడినట్లు బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో స్థానిక విలేకరులకు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగించాలని, చర్యలను వేగవంతం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. అంగోస్టూరా మున్సిపాలిటీలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో బుల్లా లోకా అని పిలువబడే ఒక గనిలో గోడ కూలిపోయింది, దీనిని గంటల తరబడి పడవ ప్రయాణం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు.
మృతుల సంఖ్య డజన్ల కొద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంగోస్టూరా మేయర్ యోర్గి ఆర్సినియెగా మంగళవారం రాత్రి గని సమీపంలోని ఒక కమ్యూనిటీకి ‘సుమారు 30 శవపేటికలను’ తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. లా పరాగ్వాలో గని కార్మికుల బంధువులు గుమిగూడి, క్షతగాత్రులను రక్షించడానికి మారుమూల ప్రదేశానికి విమానాలను పంపాలని ప్రభుత్వాన్ని కోరారు.
హెలికాఫ్టర్లు, విమానాలు పంపి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందా అని ఎదురు చూస్తున్నాం’ అని కూలిన ఘటనలో చిక్కుకున్న కుమార్తె తండ్రి కరీనా రియోస్ అన్నారు. ‘చాలా మంది చనిపోయారు, గాయపడ్డవారు ఉన్నారు. మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయరు, వాళ్లు ఎక్కడున్నారు?’ అని ప్రశ్నించారు. ఆ ప్రాంత పరిస్థితుల కారణంగా మృతదేహాలు త్వరగా కుళ్లిపోతాయని ఆందోళన చెందుతున్నట్లు రియోస్ తెలిపారు.
అయితే 2016 లో వెనిజులా ప్రభుత్వం తన చమురు పరిశ్రమతో పాటు కొత్త ఆదాయ మార్గాల కోసం దేశం మధ్యలో విస్తరించిన భారీ మైనింగ్ డెవలప్మెంట్ జోన్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి, బంగారం, వజ్రాలు, రాగి, ఇతర ఖనిజాల కోసం మైనింగ్ కార్యకలాపాలు ఆ జోన్ లోపల, బయట పనులు జరుగుతున్నాయి.
చాలా గనులు చట్టం పరిధిలోకి రాకుండా పనిచేస్తాయి. అవి సాధారణ వెనిజులా వాసులకు లాభదాయకమైన ఉద్యోగాలను అందిస్తాయి. కానీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన 71 ఏళ్ల కార్లోస్ మార్కానో మాట్లాడుతూ.. ‘ఒక సహోద్యోగి ప్రమాదకరంగా చనిపోవడం ఎవరూ కోరుకోరు. మాలో కొందరు చనిపోయారు. కొంతమంది గాయపడ్డారు. చాలామంది చనిపోయినా డెడ్ బాడీలను బయటకు తీయలేదు. దీంతో అక్కడే సమాధి చేయబడ్డారు” అని రోదిస్తూ చెప్పాడు.