దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఉలవపాళ్ళ హరిజనవాడలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ గా పోటీచేసిన నెల్లూరు సాల్మాన్ ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టిడిపి బీద రవిచంద్ర, కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.. బాణాసంచా పేల్చి, పూల వర్షం కురిపిస్తూ, మేళ తాళాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతూ టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.
20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక
Related Posts
పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి :మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు
TEJA NEWS పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి :మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలనిమున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు ఆదేశించారు. పట్టణానికి మంచినీటి సరఫరా అయ్యే పండరిపురం(రిజర్వాయర్ )…
గుంటూరు నూతన సూపరిండెంట్ డాక్టర్ రమణ యశస్వి
TEJA NEWS గుంటూరు నూతన సూపరిండెంట్ డాక్టర్ రమణ యశస్వి మర్యాదపూర్వకంగా కలిసిన మండలనేని చరణ్ తేజ్. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు నూతన సూపరిండెంట్ గా ఎన్నికైన చిలకలూరిపేట పట్టణానికి చెందిన డాక్టర్ రమణ యశస్వి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా…