ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత
52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి
52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకరించాలని అప్పుడే వాటికి సార్ధకత లభిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు
ఈనెల 21, 22, 23 తేదీలలో వనపర్తి పట్టణంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో నిర్వహించిన 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ
వనపర్తి నియోజకవర్గం విద్యాభివృద్ధి కోసం, వైద్యభివృద్ధి కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 550 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు విజ్ఞాపనలు సమర్పించి ఉన్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఇందులో కేవలం 160 కోట్లు వనపర్తి లో ముఖ్యమంత్రి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కేటాయించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ప్రస్తుతం విద్యాభివృద్ధి కోసం వనపర్తి నియోజకవర్గానికి ఎడ్యుకేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హబ్ మంజూర అయిందని దీంతో వనపర్తి నియోజకవర్గంలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించబోతున్నామని ఎమ్మెల్యే చెప్పారు
అలాగే 25 ఎకరాలలో స్పోర్ట్స్ స్కూల్ నిర్మించేందుకు సైతం అనుమతులు మంజూరయ్యాయని తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కేవలం రెండు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు కాగా అందులో వనపర్తి ఒకటి అవ్వడం గమనార్కమణి ఎమ్మెల్యే పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత మార్గాలను అధిరోహించాలని ఎమ్మెల్యే సూచించారు
విద్యార్థులు అనుకుంటే గ్రామ,మండలా, నియోజకవర్గ జిల్లా దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఈ సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రధాన చేశారు
కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా దిశా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, మండలాల విద్యాధికారులు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు