రాష్ట్రంలో ఖాళీ అయినా 3 రాజ్యసభ స్థానాల్లో 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు అవకాశం కల్పించని రాజకీయ పార్టీల భరతం పడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో వికలాంగులకు ఒక్కటి కేటాయించని రాజకీయ పార్టీల తీరును నిరసిస్తూ మునగాల మండలం కలకోవా గ్రామంలో కళ్ళకు నల్ల గంతలు కట్టుకొని వికలాంగుల వినూత్న నిరసన
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయినా 3 రాజ్యసభ స్థానాల్లో 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు అవకాశం కల్పించని కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి పార్టీల భరతం పడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవా గ్రామంలో సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సంఘం నాయకులతో కలిసి కళ్ళకు నల్లగంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ కు రెండు భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉండడంతో ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి రెండు పార్టీలు అవకాశం కల్పించాలని తాము విజ్ఞప్తి చేశామని తమ విజ్ఞప్తి రెండు పార్టీల నాయకులు విస్మరించి మరోమారూ సకలాంగులకే రాజ్యసభ స్థానాలు కేటాయించేలా అభ్యర్థులను కేటాయించడం దురదృష్టకరమని కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి పార్టీలకు వికలాంగులు సమాజంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పార్టీలు ప్రకటించడం సకలాంగుల అభ్యర్థులను మార్చి వికలాంగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అధికారంలోకి వస్తే 6000 పింఛన్ ఇస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సంఘం మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శేఖర్ రెడ్డి సంఘం నాయకులు నాగవెల్లి కరుణాకర్ కొండ సైదులు కుర్రి నాగయ్య సాయి తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రంలో ఖాళీ అయినా 3 రాజ్యసభ స్థానాలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…