
భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం
పీఠం పేరుతో ఓ అర్చకుడు మఠం నిర్మించాలని భావించి.. అత్యాశకపోయి ఓ నాశిరకం నిర్మాణం చేయడంతో చోటు చేసుకున్న దుర్ఘటన
అమ్మవారి పేరుతో ఓ అర్చకుడు ఓ పాతభవనంపై మరో నాలుగు అంతస్థులు కొత్త భవనాన్ని నిర్మిస్తుండగా గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు
అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో అప్పటి నుంచి నిర్మాణం నిలిచిపోయింది
ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాకుండా.. అమ్మవారి ఆలయాన్ని నిర్మించి.. ఆ ఆలయం పక్కనే ఈ అరు అంతస్థుల భవనాన్ని నిర్మించారు
ఒకవేల భవనం ప్రారంభోత్సవమై భక్తులు ఉండి ఉంటే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు.
