ప్రతీ పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతికేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చిన మహానేత, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
దుందిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం నుండి సికింద్రాబాద్ వరకు నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్ ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చి ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన మహానేత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు. గత పాలకుల హయాంలో నిర్మించినటువంటి ఇరుకు ఇరుకు ఇళ్లను కాకుండా విశాలవంతమైన ఇళ్లను నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
నిరుపేదలు అధికంగా నివసించే డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పటికే కుత్బుల్లాపూర్ లోని అన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుత్, మంచినీటి సరఫరా, భూగర్బ డ్రైనేజీ, బస్సు సదుపాయం వంటి వసతులు కల్పించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని, త్వరలోనే అన్ని మౌలిక వసతులు పూర్తిచేస్తామన్నారు. అనంతరం బస్సులో నాయకులు, ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో దుందిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, జక్కుల కృష్ణ యాదవ్, సాయి యాదవ్, ఆనంద్ కుమార్, బుచ్చిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బౌరంపేట పిఎసిఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్లు అర్కల జీతయ్య, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, బిఆర్ఎస్ మున్సిపల్ జనరల్ సెక్రెటరీ కొల్తూరు మల్లేష్ ముదిరాజ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.