TEJA NEWS

వేడుకలకు హాజరైన టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి

ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి లు హాజరయ్యారు. రమేష్ బాబు కేక్ కట్ చేసి జర్నలిస్ట్ మిత్రులకు స్వీట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సౌకర్యార్థం ఖమ్మం ప్రెస్ క్లబ్ ను సొంత ఖర్చులతో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు చక్కటి పూల మొక్కలు, కనీస వసతులు ఏర్పాటుచేసి గుర్తుండి పోయేవిధంగా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేసిన అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబును, ప్రెస్ క్లబ్ కమిటీని అభినందించారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ సీనియర్ నాయకులు అమరవరపు కోటేశ్వరరావు, జిల్లా నాయకులు టీఎస్ చక్రవర్తి, మందుల ఉపేందర్, యలమందల జగదీష్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కామర్తి నరేందర్, మూల జీవన్ రెడ్డి, తోట గణేష్, మందుల వెంకటేశ్వర్లు, పప్పుల వేణుగోపాల్, మదార్ సాహెబ్, ఆంతోటి శ్రీనివాస్, రోసిరెడ్డి, యాదగిరి, నల్లమోతు శ్రీనివాస్, మురళి,ఉత్కంఠం శ్రీనివాస్, మహేష్, పాశం వెంకటేశ్వర్లు, వీడియో జర్నలిస్ట్ రవి, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, రామారావు, యోనా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS