
భారత్ కు చెందిన మహిళకు అరుదైన గౌరవం
హైదరాబాద్:
భారత కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త పర్యావరణ సంరక్షరాలు పూర్ణిమ దేవి, బర్మాన్ కు అరుదైన గౌరవం దక్కింది ఉమెన్ ఆఫ్ ది ఇయర్–2025 జాబితాను టైమ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకున్న భారత్ నుంచి ఎన్నికైన ఏకైక మహిళ పూర్ణిమా దేవి, బర్మాన్, కావడం విశేషం
వివిధ దేశాలకు చెందిన 13 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. వారిలో కేవలం ఒకే ఒక్క భారతీయ మహిళ ఉంది. ఆవిడే అస్సాంకు చెందిన భార తీయ జీవన శాస్త్రవేత్త, వన్యప్రాణుల సంరక్షణాధి కారి 45 ఏళ్ల పూర్ణిమా దేవి బర్మాన్ ఈ సందర్భంగా పూర్ణిమా దేవి బర్మాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం…
అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున్న ఉన్న గ్రామంలో పెరిగిన పూర్ణిమా దేవికి చిన్నప్పటి నుంచి ప్రకృతి, పక్షులు అంటే ప్రేమ. ఆ ఆసక్తితోనే ఆమె జంతుశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ఆ సమయంలోనే గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ అనే కొంగల జాతి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుంది.
అరుదైన జాతికి చెందిన ఈ కొంగలు అంతరించిపోవ డాన్ని గుర్తించి.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని నిర్ణయించుకున్నా రు. అందులో భాగంగా 2007లో కొందరు మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారు చేశారు..
