Spread the love

రూపాయి నాణెము మింగిన మూడేళ్ల బాలుడు

ఎండోస్కోపీ విధానంతో వెంటనే తొలగించిన డా.ముప్పాళ్ళ బలరామ కృష్ణ తేజస్వీ.

చిలకలూరిపేట ; ఓ మూడేళ్ల బాలుడు మింగిన రూపాయి నాణాన్ని స్థానిక జానకీ నర్సింగ్ హోమ్ వైద్య నిపుణులు డా. ముప్పాళ్ళ బలరామ కృష్ణ తేజస్వీ తీసివేయటం జరిగింది. పట్టణానికి చెందిన ఓ బాలుడు ఆడుకుంటూ ఆదివారం రాత్రి రూపాయి నాణెము మింగటం జరిగింది. అదే పోతుందిలే అని నిర్లక్ష్యం చేసారు. బాలునికి నొప్పి ఎక్కువగా వుండటంతో స్థానిక ముప్పాళ్ళ హనుమంతరావు ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. గ్యాస్ట్రిక్ వైద్యనిపుణులు డా.ముప్పాళ్ళ బలరామ కృష్ణ తేజస్వీ అన్నవాహికలో ఇరుక్కుపోయిన నాణేన్ని ఎండోస్కోపీ విధానంలో వెంటనే తొలగించటం జరిగింది. ఇటీవల 8 సంవత్సరాల బాలుడు పెన్ క్యాప్ మింగగా వెంటనే తొలగించిన సంఘటన విధితమే. తిరిగి ఇలాంటి సంఘటనే జరిగింది. ఎలాంటి జాప్యం లేకుండా చేయడం పట్ల స్థానిక ఐ ఎం ఏ వైద్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డా.తేజస్వీ మాట్లాడుతూ పిల్లల చేష్టల పట్ల పెద్దలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారికి నాణేలు, బ్యాటరీ రింగ్ సెల్స్ , చిన్న చిన్న వస్తువులు పిల్లలకు అందుబాటులో వుంచోద్దన్నారు. అలాగే ఒకవేళ మింగితే, అదే తెల్లారి మలంలో పోతుందిలే అని నిర్లక్ష్యం చేయవొద్దనారు. వీటి వల్ల విష రసాయనాలు ప్రమాదం చేకూరుస్తాయన్నారు. మింగిన 6గంటల లోపు ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు.