TEJA NEWS

వైభవోపేతంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం….

విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

127 – రంగారెడ్డి నగర్ డివిజన్ చెన్నారెడ్డి నగర్ నందు గల అభయాంజనేయ స్వామి దేవాలయం నందు నూతనంగా ఏర్పాటు చేసిన 16 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ ఆపద సమయాల్లో భయాన్ని పోగొడుతూ ధైర్యాన్ని ఇచ్చే దైవం అభయాంజనేయ స్వామి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, జిహెచ్ఎంసీ డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, నాయకులు ఫెరోజ్, కార్తీక్ గౌడ్, అభయాంజనేయ దేవస్థానం కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS