Action should be taken against Chandupatla field assistant Ravi
చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ రవి పై చర్యలు తీసుకోవాలి
గత సంవత్సరం పెండింగ్ బిల్లులు చెల్లించాలని విన్నపం
గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు 150 మంది గ్రామస్తులు వినతిపత్రం అందజేత
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన గ్రామస్తులు
చివ్వెంల మండలంలోని బండమీది చందుపట్ల గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్ళని వారికి హాజర్లు వేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో పనిచేసిన వారికి డబ్బులు చెల్లించడం లేదన్నారు. పని చేసిన వారికి పే స్లిప్పులు ఇవ్వడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ రవిని అడిగితె నేను ఇవ్వను మీరు ఎం చేస్తారో చేసుకొండని బెదిరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 200 మందికి పైగా కూలీలు పని కావాలని దరఖాస్తు పెట్టిన ఏవో కారణాలు చూపెట్టి పని కల్పించకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్, హుజుర్నగర్ వలస వెళ్లిన వారు, గ్రామంలో ఉండి పనికి వెళ్ళని వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి హాజర్లు వేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేని వారికి హాజర్లు వేయడంతో పనికి వెళ్లిన వారికి రోజు కూలీ రూ. 120 మాత్రమే వేసి మాకు అన్యాయం చేశారని… ఇప్పుడు పని కల్పించమని అడిగితె ఎస్టిమేట్ లేదు పని లేదని చెపుతున్నారని, గ్రామంలో లేని వారికీ హాజర్లు వేయడంతో ఇప్పుడు తమకు పని లేకుండా పోయిందని కలెక్టర్ ముందు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రోజుకు సగటున రూ.280 కూలీ ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా గ్రామస్తులు కలెక్టర్ వెంకట్రావు కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దింతో డి ఆర్ డి ఏ పిడి మధుసూదన రాజు వారి వద్దకు చేరుకొని రెండు రోజుల్లో పూర్తి విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు చెప్పారు. గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు తమ సమస్యలు చెప్పుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆనంతుల యల్లయ్య, కొండేటి ఉపేందర్, సునీల్, అభిమల్ల వెంకన్న, రేణుక, సునీత, లక్ష్మి, మోలుగురి జానమ్మ, వినోద, మైసమ్మ, యల్లమ్మ, లలిత, వెంకటమ్మ, గుర్వమ్మ, చిన్న యల్లమ్మ, గుద్దేటి వెంకటమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.