TEJA NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన అదనపు కలెక్టర్ రాంబాబు

మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి

సూర్యాపేట మండలం పిల్లలమర్రి లోని పి.ఎ.సి.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సెంటర్ ద్వారా 3200 క్విoటాల ధాన్యం ను మిల్లులకి ఎగుమతి చేశామని పేర్కొన్నారు. రమావత్ రవీందర్, రమావత్ రాములకి చెందిన ట్రక్ షీట్ లను పరిశీలించారు.

రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొని రావాలి…

రైతులు తాలు లేకుండా తేమ శాతం 17 ఉండేలా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకొని రావాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శనివారం నాగారం మండలం డి.కోత్తపల్లి గ్రామంలో శివలింగ ఎం ఎ సి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ తూకం వేస్తున్న ధాన్యాన్ని పరిశీలించారు. తూకం లో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలని అన్నారు.బెల్లి వీరయ్య అనే రైతుకి చెందిన వడ్ల తేమ శాతం పరిశీలించారు.
తదుపరి నాగారం లోని వాసవి రైస్ మిల్లు తనిఖీ చేశారు. మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ పద్మ,సెంటర్ ఇంచార్జి లు నాగరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.