TEJA NEWS

ఏసీబీ వలలో చిక్కిన అదనపు అవినీతి కలెక్టర్

రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి 8 లక్షల లంచం తీసుకుంటుండగా ఓఆర్ ఆర్ పరిధిలో ఏసీబీ అధికారులకు చిక్కారు.

ధరణిలో పనులు చేసేందు కు మధ్యవర్తులతో ఒప్పం దం చేసుకున్న భూపాల్ రెడ్డి ఒప్పందం ప్రకారం ఎనిమిది లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు. రాత్రి నుంచి కార్యా లయం లోనే భూపాల్ రెడ్డి విచారిస్తున్నారు.

భూపాల్ రెడ్డి తో పాటు మదన్మోహన్ మరో అధికా రులు కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా భూపా ల్ రెడ్డి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ తట్టి అన్నా రం ఇందు అరణ్య 156 జిల్లాలో నివాసం ఉంటున్న భూపాల్ రెడ్డి ఇంట్లో సైతం రాత్రి నుంచి సోదాలు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులను బయ టకు వెళ్లకుండా విచారణ చేపట్టినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నగదు తో పాటు పత్రాలు లభిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

ఈ దాడులలో ఏసీబీ సిటీ రేంజ్ 1 డిఎస్పి శ్రీనివాస రెడ్డి, ఇన్స్పెక్టర్లు జానకిరామ్ రెడ్డి,నరేష్ ఇతర బృందం ఈ దాడులు పాల్గొన్నట్లు సమాచారం పూర్తి వివరా లను తొందరలో మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు.


TEJA NEWS