Awareness of new criminal laws must: Additional SP Vinod Kumar
జగిత్యాల జిల్లా….
కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన తప్పనిసరి: అదనపు ఎస్పీ వినోద్ కుమార్
జులై 1 తేది నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కొత్త చట్టాలపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ… కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు – *భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం. 2023 ఈ మూడు చట్టాలు రానున్న జూలై 1, 2024 నుండి అమలులోకి రానున్నాయి. అందులో బాగంగా జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు , సిబ్బందికి శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. క్రిమినల్ చట్టాల సూక్ష్మ నైపుణ్యాలను మరియు కొత్త మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సమాజానికి వాటి ఆచరణాత్మక ఉపయోగం మరియు చుట్టూ జరుగుతున్న నేరాల గురించి అదనపు ఎస్పీ క్లుప్తంగా అందరికీ వివరించారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుండి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.