
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పరిశీలించిన ఏఈఓ
సూర్యపేట జిల్లా : నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఈఓ (వ్యవసాయ విస్తరణ అధికారి) బి.జానయ్య తేమ, ధాన్యం నాణ్యత పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఈఓ జానయ్య మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ప్యాడి క్లీనర్ నందు లేదా ట్రాక్టర్లతో నడిచే గాలిపంకల సహాయంతో ధాన్యాన్ని శుభ్రంగా తూర్పార పట్టి తేమ 17శాతం వచ్చేవరకు ఎండబెట్టి తీసుకురావాలని అట్టి ధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం ఏ గ్రేడ్ క్రింద కొనుగోలు చేస్తుందని అట్టి ధాన్యానికి రూ.2320 ఒక కింటా చొప్పున గిట్టుబాటు ధర వర్తిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మాజీ జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి, పిఎసిఎస్ చిల్పకుంట్ల ఇన్చార్జి యాస రజిత, రైతులు తోట్ల హరీష్ , మందడి భూపాల్ రెడ్డి, సుంకురెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
