
ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు.
139 వ మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ లెనిన్ నగర్ లో, శ్రీనివాస్ నగర్ బస్ స్టాప్ లో, 126 డివిజన్ శ్రీనివాస్ నగర్ లో, మక్డుం నగర్ లో, అంజయ్య నగర్ లో, బీరప్ప నగర్,జగదిరిగుట్ట చివరి బస్ స్టాప్ వద్ద, జగద్గిరిగుట్ట డంపింగ్ యార్డ్ వద్ద, రంగారెడ్డి నగర్ డివిజన్లోని గుబురుగుట్ట, ఆల్ బెస్టాఫ్ కమాన్,రంగారెడ్డి నగర్ బస్ స్టాప్ వద్ద, గిరి నగర్,గాంధీనగర్ ఏఐటీయూసీ కార్యాలయం, ఐడిపిఎల్ ఆటో యూనియన్, మున్సిపల్ కార్యాలయం, ఉషోదయ టవర్స్, షాపూర్ నగర్, హమాలీ అడ్డా, గండి మైసమ్మ చౌరస్తా, దుండిగల్ గ్రామంలో, ఆర్టీసీ డిపో తదితర ప్రాంతంలో నేడు ఏఐటియుసి, సిపిఐ జండాలను ఎగురవేయడం జరిగింది. షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ గారు ఏఐటియుసి జెండాను ఎగురవేయడం జరిగింది.
అనంతరం షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షులు హరినాథ్ రావు గారు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు స్వామి స్వాగత ఉపన్యాసం చేయగా ముఖ్య అతిథిగా ప్రముఖ శాస్త్రవేత్త సోమ సుందర్
హాజరై ప్రసంగించడం జరిగింది. 139 సంవత్సరాల క్రితం పని గంటల కోసం కార్మికులు పోరాటం చేస్తే అది తర్వాత కార్మికులలో స్ఫూర్తిని నింపి కార్మిక హక్కులను సాధించుకోవడం జరిగిందని నాడు కార్మికులు సాధించుకున్న హక్కులను నేటి పాలకులు కాలరాస్తున్నారని వాటిని ప్రజలు అడగకుండా చేయడానికి అన్ని అంశాలను మతము, దేవుడు అనే పేరుతో ముడిపెట్టి ప్రజలలో కార్మిక చైతన్యాన్ని తొలగించి మత చైతన్యాన్ని తీసుకువచ్చి వారిని వారి హక్కుల నుంచి దూరం చేస్తున్నారని విమర్శించారు, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కార్మికులను వాళ్ల వాళ్ల భార్యల దగ్గర కూర్చోవడం కంటే పని చేయడమే మేలు అని మాట్లాడడం దానిని బూర్జవవర్గ ప్రతినిధులైన బిజెపి కాంగ్రెస్, టిఆర్ఎస్ లాంటి పార్టీలు వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడ లేదని వారి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడింది కేవలం కమ్యూనిస్టులేనని కమ్యూనిస్టుల అసలు లక్ష్యం కూడా కార్మిక రాజ్యం ఏర్పాటు చేయడమేనని కావున కార్మికులందరూ చైతన్యవంతమై కార్మిక పార్టీలను ప్రోత్సహించాలని కోరడం జరిగింది. ఈ సమావేశం మరో అతిథులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యేసు రత్నం మాట్లాడుతూ కార్మికుల పని గంటల దినాలు, కనీస వేతనాలు,యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, ఈ ఎస్ ఐ, పిఎఫ్ లాంటి సంక్షేమ పథకాలను నేడు కార్మికులు అందుకుంటున్నారంటే అది ఏఐటీయూసీ చేసిన పోరాటాల ఫలితమేనని ఉన్న హక్కులను కాపాడుకోలేని పరిస్థితి నేడు ఏర్పడ్డదని దానికి ముఖ్య కారణం మతం కులం ప్రాంతం అనే పేరుతో బూర్జవ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ లు కార్మిక వర్గాన్ని విడగొట్టడం వల్లనేనని,ఇప్పటికైనా కార్మికులు నిజం తెలుసుకొని ఐక్యమైతే ఉన్న కార్మికుల హక్కులను కాపాడుకొని మరిన్ని సంక్షేమ ఫలాలను పొందవచ్చని కాబట్టి ఏఐటీయూసీ మరియు సిపిఐ చేసే కార్మిక పోరాటాలలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలని అసెంబ్లీలో ఉన్నటువంటి 117 మంది ఎమ్మెల్యేలలో ఒకే ఒక్కడు అయినటువంటి కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యేగా ఉండి ప్రతి సమావేశంలో కార్మికుల హక్కుల గురించి మాట్లాడుతున్నాడని ఇతర పార్టీల ఏ శాసనసభ్యుడైనా మాట్లాడుతున్నాడో లేదో గమనించాలని దాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి రానున్న రోజుల్లో సిపిఐ సభ్యులను శాసనసభ్యులుగా ఎన్నుకుంటే మరిన్ని హక్కులను పొందవచ్చని కాబట్టి మే డే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మనమందరం కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఘనమైన సంఖ్యలో అసెంబ్లీకి పంపించాలని కోరారు.
ఈ కార్యక్రమాలకు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్, సిపిఐ సహాయ కార్యదర్శి నరసింహ రెడ్డి, దుర్గయ్య, కోశాధికారి సదానంద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ప్రవీణ్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు హైమావతి, మాజీ కౌన్సిలర్ నరసయ్య, ఏఐటీయూసీ,సిపిఐ నాయకులు సాయిలు యూసుఫ్ కే వెంకటేష్ చంద్రయ్య బాల్రాజ్ ఏం సహదేవరెడ్డి సి వెంకటేష్ రాములు కృష్ణ శ్రీ నర్సయ్య స్వామి యాదగిరి ఇమామ్ విజయ్ యాకూబ్ యాదయ్య కుమార్ రాజు చందర్ సామిల్ రవి రాములు ఆశయ్య సుంకిరెడ్డి మహేష్ బోనాల కనకయ్య భీమేష్ శ్రీనివాస్ డానియల్ ఖయ్యూం రాజేష్ కమలమ్మ జంబు కార్తీక్ స్వామి బిక్షపతి మల్లేష్ తోపాటు ప్రజానాట్యమండలి అధ్యక్షులు భాస్కరాచారి కృష్ణ పాల్గొని విప్లవ గేయాలను ఆలపించడం జరిగింది.
ఈ కార్యక్రమాలలో వందలాది మంది పాల్గొనడం జరిగింది.
