TEJA NEWS

అజరామరుడు బాబా సాహెబ్ అంబేద్కర్ :నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.

చిలకలూరిపేట:భూమి, ఆకాశం సూర్యచంద్రులున్నంతకాలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాపకాలు భారతీయుల మదిలో నిలిచి ఉంటాయని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు అన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కాటూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ భరతమాత కన్న ముద్దుబిడ్డ వెలకట్టలేని విలువైన ఆణిముత్యం బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో అంబేద్కర్ చిత్రపటానికి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు పల్లె పోగు రాజు షెడ్యూల్డ్ తెగల నాయకులు ఉసర్తి ఆంజనేయులు కేతావతు సాంబశివ నాయక్ షేక్ నసురుద్దీన్ లు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ సమన్వయకర్త రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఎటువంటి లోపాలు లేని అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి అందించిన మహా జ్ఞాని బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.

బాబా సాహెబ్ చూపిన బాటలో నడిచేది, దేశాన్ని నడిపించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. హిందువులు భగవద్గీత ముస్లింలు ఖురాన్ క్రైస్తవులు బైబిల్ పవిత్ర భావంతో చేతపట్టుకున్నట్లే 144 కోట్ల మంది భారతీయులు రాజ్యాంగాన్ని చేత పట్టుకోవాలని, రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. రాజ్యాంగ విశిష్టతను, ప్రాధాన్యతను గుర్తించిన రాహుల్ గాంధీ నేడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగాన్ని చదవాలని రాజ్యాంగ సూత్రాలను ఆచరించాలని రాజ్యాంగ విశిష్టతను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చెప్పడం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నసురుద్దీన్ పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు లీగల్ సెల్ కార్యదర్శి యప్పాల అంజిరెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఉసర్తి ఆంజనేయులు ఎస్సీ నాయకులు పల్లె పోగు రాజు కారుచోల స్వప్న కుమార్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు షేక్ బాషా బీసీ నాయకులు కోవూరు రాజా ఎస్ అంతర్వేది యడ్లపాడు మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెపు సుబ్బారావు చిలకలూరిపేట మండల కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడు షేక్ ఖాజా బుడే మైనారిటీ నాయకులు షేక్ సుభాని షేక్ కరీం బాషా యువ జన కాంగ్రెస్ నాయకుడు శ్రావణ్ కుమార్ సింగ్ బొందిలి రామాంజనేయ సింగ్, పెదలంక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS