
ఉపాధ్యాయులు అందరుకూడా జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఆలపాటి రాజా కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలి – MLA బొండా ఉమ
20-2-2025 ఉదయం 10:00″గం లకు” విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ కర్నాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ నందు MLC ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు అవగాహన కల్పించడం జరిగినది…
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :-ఉమ్మడి గుంటూరు-కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్స్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గ్రాడ్యుయేట్స్ అందరూ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజా కి ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని…
ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని MLC గా గెలిపిస్తే ఈ రెండు ఉమ్మడి జిల్లాలు తో పాటు నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో ఈయన కూడా ఒక భాగస్వామ్యం చదువుకున్నటువంటి వారి గొంతును వినిపిస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి వారికి అవసరమైనటువంటి విధముగా ఉద్యోగులకు ప్రధానముగా ఉపాధ్యాయులకు అన్ని రకాల అయినటువంటి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించడంలో ప్రదానంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని అందుకని MLC గా రాజేంద్రప్రసాద్ ను గెలిపిస్తే పట్టభద్రులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు…
ఈ కార్యక్రమంలో:- 23 వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, చింతా దుర్గారావు, రత్న తదితరులు పాల్గొన్నారు…
