
అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఏఎంసి చైర్మన్
ధర్మారం, : మండలంలోని రామయ్యపల్లె గ్రామంలో ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామ శాఖ అధ్యక్షులు కోటా మహేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయనున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్ హాజరై.. అర్హులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలని లక్ష్యంతోనే ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి, ఖిలావనపర్తి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చైర్మన్ పోలు దాసరి సంతోష్, తాజా మాజీ ఉపసర్పంచ్ పంజాల లత శ్రీనివాస్, దొంగతుర్తి మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్వాల రాజేశం, లైశేట్టి రాములు, సముద్రాల మల్లయ్య, మార్క తిరుపతి, ఇంఛార్జి డీలర్ తిరుపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
