TEJA NEWS

అమితాషాను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి *
ధర్మపురి
పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రభుత్వ విప్ &ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేషం ఏర్పాటు చెసి పార్లమెంట్ లొ అమితాషా చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండించడం జరిగింది
ఈసందర్బంగా నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ లొ కేంద్ర హోం మినిస్టర్ అమితాషా అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అని అనుడు ఫ్యాషన్ అయిపోయింది అన్నిసార్లు భగవంతుణ్ణి ప్రార్ధిస్తే 7 జన్మల స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అనడం భారత రాజ్యాంగం రచించిన DR బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లేనని ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి దేవున్ని భజన చేసుకుంటూ గుడిలో ఉండాలే తప్ప రాజకీయాలలోకి రావద్దని అన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానె చట్టసభలలోకి వచ్చి రెండు సార్లు మంత్రిపదవి అనుభవిస్తున్న చరిత్రను మరిచిపోతున్నారని మనువాద చరిత్రను తిరగరాయాలనే కుట్రను కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఇలాంటి వాక్యాలు భారత రాజ్యాంగంను మార్చాలనే కుట్రలో భాగమని దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహిస్తూ కేంద్ర క్యాబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు..


ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు తడగొండ రాజు,ప్రధానకార్యదర్శి చాట్ల విజయభాస్కర్,అధికార ప్రతినిధి పూసాల తిరుపతి,నంచర్ల తాజా మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి,ఇస్లావత్ రవినాయక్,మాజీ మండల అధ్యక్షులు ఆకుల విష్ణు,SC సెల్ మండల అధ్యక్షులు తడగొండ తిరుపతి, ST సెల్ అధ్యక్షులు అంజి నాయక్, చాట్ల ప్రశాంత్,యూత్ టౌన్ ప్రెసిడెంట్ వడ్లూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు కడారి తిరుపతి,చెట్ల కిషన్,ఎలగొండ క్రిష్ణహరి,మందపల్లి అంజయ్య, అరికట్ల సంజీవ్,మద్దెల సుధీర్,ఐల్నేని వంశీ అక్కేనపల్లి నాంపల్లి,తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS