తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత నేత ,మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా వారిని మనసారా స్మరించుకుంటూ ఆ మహనీయుడు విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు. ఈ కార్యక్రమంలో నాయకులు సంబాశివా రెడ్డి, కుమార్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వెంకటేష్ ( వైయస్), భాష్కర్ రెడ్డి, నారాయణ రెడ్డి,రామకృష్ణ రెడ్డి, ఏవి రెడ్డి, శేఖర్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగినది.