TEJA NEWS

అంగన్వాడి కార్యకర్తను హత్య చేసిన మావోయిస్టులు

భద్రాచలం:
చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా, బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పి ఎఫ్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు అంగన్వాడీ కార్యకర్తనుహత్య చేసినట్లు తెలిసింది.

బీజాపూర్, తిమ్మాపూర్ లోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుండి 1 కి.మీ. దూరంలో అంగన్‌వాడీ కార్యకర్త దారుణ హత్యకు గురికావడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

అంగన్వాడీ కార్యకర్త లక్ష్మికి మావోయిస్టుల నుండి ఇప్పటికే రెండుసార్లు హెచ్చరిక వచ్చినట్లు సమాచారం. అంగన్వాడీ కార్యకర్తను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కుమారుడి ఎదుటే రాత్రి 8 గంటల సమయంలో పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు.

రక్షించేందుకు వచ్చిన కొడుకుతో దుండగులు గొడవ పడ్డారు. ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నందునే అంగన్వాడీ కార్యకర్త లక్ష్మిని మావోలు హత్య చేసినట్లు గా సమాచారం.


TEJA NEWS