TEJA NEWS

ఏపీ “సాక్షి” ఎడిటర్ ధనుంజయ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఖండిస్తున్నాం

టిఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సాక్షి తెలుగు దినపత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా దాడులు చేయడం ఎడిటర్ ఇంట్లో భయభ్రాంతులు కలిగించడం హేయమైన చర్యగా భావిస్తున్నామని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్(టీఎస్ జెఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి గురువారం సాయంత్రం ఒక ప్రత్యేక ప్రకటన లో తెలిపారు. ఏపీ పోలీసులు జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నట్లుగా ఉన్నదన్నారు.భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 లో పొందుపరిచిన హక్కులను కాలరాయడం మీడియా స్వేచ్ఛను హరించి వేయడం అన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని పత్రిక రూపంలో ప్రశ్నించడం మీడియా హక్కు అన్న సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు.ఏపీ ప్రభుత్వ పక్షాన అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ వ్యాపారస్తుల ఇంట్లో దోపిడీదారుల ఇంట్లో చొరబడినట్లుగా చొరబడి సోదాలు చేయడం ఎంతవరకు సబబు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల లో ఉన్న అన్ని జర్నలిస్టు యూనియన్లు ఖండించాలని యాదగిరి కోరారు. ధనుంజయ రెడ్డి కి సపోర్టుగా మీడియా ఉంటుందని వివరించారు. మీడియా స్వేచ్ఛను అణచివేస్తూ తమకు నచ్చిన మీడియాను మాత్రమే ప్రోత్సహించాలని చూసే వారిపట్ల జర్నలిస్టులు కఠినంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రజలు దీన్నంతటినీ గమనిస్తున్నారని యాదగిరి అన్నారు.పోలీసులు వెంటనే ధనుంజయ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తమ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు