
సిగ్గు సిగ్గు… సిగ్గు సిగ్గు…ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం సిగ్గు, సిగ్గు….
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కుత్బుల్లాపూర్ లో ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు…
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆదేశాల మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో “దిష్టిబొమ్మ దగ్దం” కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండానే అమలు చేసినట్లు గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం తెలియజేయడం ప్రభుత్వ చేతగానితనాన్ని తెలియజేస్తుంది. ఆరు గారెంటీలను అమలుపరిచే దమ్ము, ధైర్యం లేక గవర్నర్ ప్రసంగం ద్వారా అమలు కానీ హామీలను అమలు పరిచామని అబద్ధాలు చెప్పడం పేరు గొప్ప… ఊరు దిబ్బ అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఉందని, ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ని సభ నుండి సస్పెండ్ చేయడమంటే ప్రజా సమస్యలను వినే పరిస్థితిలో ప్రభుత్వం లేదనేది స్పష్టమవుతుందన్నారు. అనంతరం ధర్నా నిర్వహిస్తున్న బిఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, జగద్గిరి గుట్ట వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, సంపత్ మాధవరెడ్డి, గుమ్మడి మధుసూదన్ రాజు, డాక్టర్ హుస్సేన్, కమలాకర్, నరేందర్ రెడ్డి, ఎండి గౌస్, మక్సుద్ అలీ, సమ్మయ్య నేత, నదీమ్ రాయ్, ఇబ్రహీంఖాన్, గుబ్బల లక్ష్మీనారాయణ, మూసాఖాన్, మసూద్, కార్తీక్ గౌడ్, సాజిద్, మహమ్మద్ యూసుఫ్, మెట్ల శ్రీను, శ్రీశైలం, ఏసు, నవాబ్, అల్లావుద్దీన్, జునైద్, బండ మహేందర్, కొండా శ్రీనివాస్, ఇస్మాయిల్, ఆసిఫ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.