గాంధీ జయంతి సందర్బంగా బాబుక్యాంప్ హైస్కూల్, ఎంసిహెచ్ ఆసుపత్రిలో కలెక్టర్ జీవి పాటిల్ గారితో కలిసి మొక్కలు నాటిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం ( ) చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ హైస్కూల్, రామవరం మాతశిశు ఆసుపత్రి ఆవరణలో జిల్లా కలెక్టర్ జీతీష్ వి. పాటిల్ తో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలతో పాటు ఔషద మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎండబ్ల్యూఓ సంజీవ్ రావు, రామవరం పరిరక్షణ సమితి సభ్యులు ముస్తాఫా, మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, డీఈఓ వెంకటా చారి, టీచర్ దస్తగిరి, లగడపాటి రమేష్ చంద్, స్కోట్స్ అండ్ గైడ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.