TEJA NEWS

నంది వస్త్రాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి, దారపనేని

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో నగర కంటి విమల, నగర కంటి సుబ్బారావు, నగర కంటి సుబ్రహ్మణ్యం నూతనంగా ప్రారంభించిన నంది వస్త్రాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారాపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి పాల్గొని నంది వస్త్రాలయం ప్రోప్రైటర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా దారపనేని, బైరెడ్డి మాట్లాడుతూ తమకు అత్యంత సన్నిహితులైన నగర కంటి వారు నూతన వ్యాపారాన్ని పామూరులో ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. వారి వ్యాపారాభివృద్ధి దేదీప్యమానంగా వెలువందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్ దారపనేని జనార్దన్ రావు, కృష్ణ, బాలాజీ జ్యువెలర్స్ అధినేత గుత్తి వెంకటరాజా, ఏపీవో నాగార్జునసాగర్, మిరియం సుబ్బరాయుడు ప్రోపరేటర్స్ నగరికంటి వారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.