TEJA NEWS

కన్నుల పండుగగా బాజీ బాబా ఉరుసు మహోత్సవం

  • బాజీ బాబా దర్గా ఉరుసు ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి: మాజీమంత్రి ప్రత్తిపాటి*
  • ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ముజావర్ల ఆశీర్వాదం తీసుకున్న ప్రత్తిపాటి
    చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరుగుతున్న హజరత్ సయ్యద్ బాజీబాబా ఉరుసు
    బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవానికి తరలివచ్చే వేలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని, ఎన్నోఏళ్ల నుంచి సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఉరుసు ఉత్సవాలు కుల,మతాలకు అతీతంగా జరగడం గొప్ప విషయమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసిన ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి, స్వయంగా భక్తులకు అన్నవితరణ చేసి, రుచి.. శుచిపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రత్తిపాటి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముజావర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గంథ మహోత్సవంలో గ్రామస్తులు పాల్గొని, సమిష్టిగా వేడుక నిర్వహించాలని ప్రత్తిపాటి సూచించారు.
  • గత ప్రభుత్వం నిర్వాకం వల్ల దర్గా, ఈద్గా, గుడి బైపాస్ లో పోయేవి అని కూటమి ప్రభుత్వం రావటం వాళ్లనే మార్పులు చేశామని అలానే అతి త్వరలోనే షాదిఖానా నిర్మాణానికి కృషి చేస్తామని ప్రత్తిపాటి తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులు నిర్వాహకులు, పోలీస్ వారి సూచనల్ని పాటించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దైవచింతనతో వ్యవహరించాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, అంబటి సొంబాబు, గుంటూ కోటేశ్వరరావు, అమీర్ జాన్, గోపాలం నాగేశ్వరరావు, గుంటూ సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు.