TEJA NEWS

శ్రద్ధ, సబూరి తో ఉండండి… అన్ని సిద్ధిస్తాయని లోకానికి చాటిన దైవం “సద్గురు సాయినాధుడు” : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …

130 – సుభాష్ నగర్ డివిజన్ అపురూప కాలనీలోని సాయిబాబా దేవాలయం 26వ వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై సద్గురు సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…శ్రద్ధ, సబూరి ద్వారా ఓపిక, నమ్మకంతో ఉండండి, సమయానుగుణంగా అన్నీ సిద్ధిస్తాయనని చాటిన దైవం “సద్గురు సాయినాధుడు” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు పందిరి యాదగిరి, గుబ్బల లక్ష్మీనారాయణ, పిఎస్ఎన్ రాజు, వల్లభనేని రమణ, శేషా చారి, దుర్గా రావు, టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ తిప్పా రెడ్డి, సెక్రెటరీ కంచ కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజబాబు, కోశాధికారి మస్తాన్ బాబు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.