Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్య నగర్ ఫేజ్ 3 కాలనీలో నిత్యం కరెంట్ ట్రిప్ అవుతున్నదని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎలక్ట్రికల్ ఏ ఈ ని పిలిచి కాలనీ వారితో కలసి పరిశీలించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాల్సిందిగా ఏ ఈ ని ఆదేశించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, కాలనీ వారు విద్యుత్తు ఉత్పాదన హెచ్చు తగ్గులు వలన ప్రతి రోజు విద్యుత్తు అంతరాయం నిత్యం కలుగుతున్నదని, ఇంట్లోని ఎలక్ట్రికల్ సామానులు కాలిపోతున్నాయని నా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి మేరకు, తక్షణమే ఎలక్ట్రికల్ ఏ ఈ ని పిలిచి కాలనీ లో పర్యటించి ఎక్కడ సమస్య ఉన్నదో తెలుసుకొని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని చెప్పి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భాగ్య నగర్ ఎలక్ట్రికల్ సెక్షన్ ఏ ఈ దయానంద్ గారు, లైన్ మెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.