
భైరవకోన , మిట్టపాలెం నారాయణస్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు
సీఐ భీమా నాయక్
కనిగిరి
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం, పర్యాటక క్షేత్రం కనిగిరి నియోజకవర్గం సిఎస్ పురం మండలం భైరవకోన క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుదీర్ఘ దూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా భైరవకోన కు వస్తుంటారు. భైరవకోనలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను పామూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ భీమా నాయక్ పరిశీలించారు. వసతులు, వాహనాల పార్కింగ్, తదితర అంశాలపై ఆలయం అధికారులతో సీఐ చర్చించారు. శివరాత్రి ఉత్సవాలకు భైరవకోనలో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ భీమా నాయక్ తెలిపారు. సమన్వయంతో పనిచేసి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని సీఐ భీమా నాయక్ తెలిపారు.
